పోలీసుల బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఎస్ఐ, కానిస్టేబుల్‌కు గాయాలు

10చూసినవారు
పోలీసుల బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఎస్ఐ, కానిస్టేబుల్‌కు గాయాలు
AP: విశాఖలోని ఆరిలోవ క్రైమ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. క్రైమ్ ఎస్‌ఐ హరికృష్ణ, కానిస్టేబుల్ వీరేంద్రతో కలిసి ధారపాలెంలో దోపిడీ కేసుకు సంబంధించి రహదారిపై సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలు సేకరించారు. మంగళవారం రాత్రి బైకుపై వస్తుండగా కారు అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్