VIDEO: భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

46679చూసినవారు
AP: విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామానికి చెందిన పకృతి శివ (35), పకృతి శ్రీను (22)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్