చైన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై కారు దగ్దం

8చూసినవారు
AP: కృష్ణా జిల్లాలో సోమవారం చైన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం అంపాపురం-కోడూరుపాడు మధ్య కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి ఏలూరు వైపునకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపుచేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం, సకాలంలో పోలీసులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్