వాగులో కొట్టుకుపోయిన కారు (వీడియో)

135చూసినవారు
AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులకు వరద నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో యరజర్ల-వెంగముక్కలపాలెం మధ్యలో కారు వాగులో కొట్టుకుపోయింది. కారు నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.