యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. వీటిలో జింక్, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. నోటి దుర్వాసనను పోగొట్టడంతో పాటు చిగుళ్ల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి, బీపీని అదుపులో ఉంచుతాయి. శ్వాసకోశ సమస్యలైన జలుబు, ఆస్తమాతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తాయి. ఊపిరితిత్తులలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి.