AP: వర్షాలు లేక తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితులు ఎదురవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. నీటి సమస్యలపై ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరో వచ్చి సమస్యను పరిష్కరిస్తారని ఎదురుచూడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు.