AP: మద్యం రవాణా టెండర్లలో అక్రమాల ఆరోపణల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. మద్యం రవాణాకు సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు కాంట్రాక్టులు కేటాయించిన వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాయపాటి పురుషోత్తంరావు, మర్రి సుబ్బారెడ్డి, రమేష్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి కాంట్రాక్టు కాలంలో మర్రి సుబ్బారెడ్డి, పురుషోత్తంరావు కలిసి 59.14 లక్షల మద్యం పెట్టెలను రవాణా చేసిన అంశంపై ఆరా తీస్తున్నారు. సిగ్మా సంస్థ నుంచి రూ.15.44 కోట్ల మేర లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం.