ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

14368చూసినవారు
ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు
AP: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏపీ పోలీసులపై కేసు నమోదైంది. సీనియర్ జర్నలిస్టు కే.వెంకట్రాంరెడ్డి భార్య విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన పట్ల సీఐ శ్రీనివాస రావు అనుచితంగా, అమానుషంగా, అమర్యాదగా ప్రవర్తించారని విజయలక్ష్మీ ఆరోపించారు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారి మహిళ అని కూడా చూడకుండా ఇలా ప్రవర్తించడం రెండు రాష్ట్రాల పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్