భారతి సిమెంట్‌ మేనేజర్‌ భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదు

101చూసినవారు
భారతి సిమెంట్‌ మేనేజర్‌ భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదు
AP: కడప జిల్లాలో భారతి సిమెంట్ మేనేజర్‌ భార్గవ్‌రెడ్డిపై మోసం కేసు నమోదైంది. జగన్ పాలన సమయంలో భూముల అంశంలో ఇతను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కడపకు చెందిన మహబూబ్‌ఖాన్‌ దగ్గర భార్గవ్‌రెడ్డి భూమి ఇప్పిస్తానని రూ.60 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. అయితే, ఆ భూమి లేదని తేలడంతో, అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే భార్గవ్‌రెడ్డి ముఖం చాటేశాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు భార్గవ్‌రెడ్డిపై సీకే దిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్