AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ మీడియా కార్యాలయం ఎదుట నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన చేపట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంబటి రాంబాబుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపైనా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.