మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో రూ.కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసినా క్వార్ట్జ్ తరలించారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దాంతో కాకాణి సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాకాణిని ఏ4గా చేర్చారు.
