AP: మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదైంది. శుక్రవారం మచిలీపట్నంలోని ఆర్ పేట సీఐ ఏసుబాబుపై దురుసుగా ప్రవర్తించారు. దాంతో ఆయనపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేేసు నమోదైంది. నిన్న వైసీపీ నేత సుబ్బన్నను విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు.