TG: మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతిలో కేసు నమోదైంది. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా నిరసనలు చేయడంతో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైసీపీ నేతలపై తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కేసులు నమోదు చేశారు. రోజా, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతిలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.