AP: వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బిగ్ షాక్ తగిలింది. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలో భాగంగా, ఓ వైసీపీ నేత పోలీస్ కానిస్టేబుల్‌ను నెట్టివేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో .. అదే రోజు సీదిరికాశీబుగ్గ పోలీస్ స్టేషన్ (పీఎస్) వద్దకు వెళ్లి, తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ రాత్రి ఒంటి గంట వరకు అక్కడే బైఠాయించారు. ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు సీదిరి అప్పలరాజు సహా 14 మందిపై కేసు నమోదు చేశారు.