జడ శ్రావణ్‌పై 4 స్టేషన్లలో కేసుల నమోదు

80చూసినవారు
జడ శ్రావణ్‌పై 4 స్టేషన్లలో కేసుల నమోదు
AP: ఏలూరు, కాళ్ల పోలీసు స్టేషన్లలో జై భీమ్‌ భారత్‌పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రసంగించారనే ఫిర్యాదులపై ఈ కేసులు నమోదు చేశారు. గత నెల 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం బహిరంగ సభలో శ్రవణ్‌, యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌లు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను వ్యక్తిగతంగా దూషించి హేళన చేశారని పెద్దాడ వెంకటరమణ, తోట ఫణిబాబు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్