AP: రైతులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే విధానం అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటికే రూ.560 కోట్లను రైతులకు నగదు చెల్లించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు 6.34 కోట్ల గోనె సంచులు రైతు సేవా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచామని, రవాణా కోసం 32 వేల లారీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.