AP: త్వరలోనే కాకినాడ జీజీహెచ్‌లో క్యాథ్‌ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. వీటితో పాటు తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం బోధనాస్పత్రుల్లోనూ కొత్త క్యాథ్‌ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అత్యాధునిక గుండె వైద్య పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.34 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.