తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సీబీఐ క్లీన్‌చిట్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టంగా నిర్ధారించింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) ద్వారా నెయ్యి నమూనాలను పరీక్షించగా, అందులో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని NDDB నివేదిక ఇచ్చింది. సీబీఐ 2025 జనవరి 8న NDDBకి లేఖ రాయగా, 2025 మార్చి 27న NDDB తన నివేదికను సీబీఐకి అందజేసింది. ఈ నివేదికతో కల్తీ ఆరోపణలకు సీబీఐ ముగింపు పలికింది.
