AP: కృష్ణా జిల్లాలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ
వైసీపీ రేపు (సోమవారం) నిర్వహించనున్న ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసన ర్యాలీకి అనుమతి లేదని, పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తికి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు పోలీసులు నోటీసులు అందించారు.