AP: డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని
వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మూడు లక్షల మంది అభ్యర్థుల తరఫున
వైసీపీ గొంతు వినిపించింది. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాధారాలు బయటికి వచ్చాయి. అయినా సీబీఐ విచారణ వేయడానికి ప్రభుత్వానికి ఏంటి సమస్య’ అని ప్రశ్నించారు.