సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుండి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అధికారులు మంగళవారం హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ కోసం అందుబాటులోకి తెచ్చారు. పాఠశాలలు పరీక్ష సంగమ్ పోర్టల్‌లో లాగిన్ అయి, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా రెగ్యులర్ విద్యార్థుల అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.