త్రిభాషా విధానం అమలుపై సీబీఎస్‌ఈ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 7, 8, 9, 10 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. మూడో భాషకు సంబంధించిన మూల్యాంకనం స్కూళ్లలోనే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం 6వ తరగతి విద్యార్థులకు మాత్రమే త్రిభాషా విధానం అమల్లో ఉంటుందని పేర్కొంది. అలాగే 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు బోర్డు
పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది.