అమెరికా-ఇరాన్ మధ్య 15 రోజుల పాటు కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ప్రకటించడంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రోడ్లపైకి భారీగా తరలివచ్చి ఇరాన్ జెండాతో ర్యాలీలు తీశారు. శ్రీనగర్, బుద్గాం, పూంచ్, కార్గిల్ వంటి ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చుతూ, నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకున్నారు. దీనిని ఇరాన్ సాధించిన విజయంగా అక్కడి ప్రజలు అభివర్ణించారు.