AP: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్
బీజేపీ కార్యకర్తగా, ప్రధాని మోదీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని YS షర్మిల ఆరోపించారు. శనివారం జ్ఞానేశ్ రాజీనామా కోరుతూ ఆమె ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించడం దుర్మార్గపు చర్య అని, జ్ఞానేశ్ రాజీనామా చేయాలి లేదా తొలగించాలని, విచారణ జరిపి అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. పవిత్రమైన ఓటును
బీజేపీ చోరీ చేస్తోందని,
మోదీ ఓట్ల గజదొంగ అని, ఈసీ
మోదీ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆమె ఆరోపించారు.