కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (PM-SYM) పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18-40 ఏళ్ల మధ్య ఉండి, నెలసరి ఆదాయం రూ.15,000 లోపు ఉన్నవారు, ఇతర పెన్షన్ పథకాల్లో లేనివారు ఈ పథకంలో చేరవచ్చు. నెలకి రూ.55 నుంచి ప్రీమియం చెల్లిస్తే, 60 ఏళ్ల తర్వాత రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. లబ్ధిదారుడు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి రూ.1,500 ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.