E20 పెట్రోల్ పాలసీపై పార్లమెంట్‌లో స్పష్టత ఇచ్చిన కేంద్రం

15276చూసినవారు
E20 పెట్రోల్ పాలసీపై పార్లమెంట్‌లో స్పష్టత ఇచ్చిన కేంద్రం
దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించే E20 పెట్రోల్ పాలసీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక స్పష్టత ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. E20 ఇంధన వినియోగం, పాత వాహనాల భద్రత, దీని వల్ల చేకూరే ప్రయోజనాలను కేంద్రం సమగ్రంగా వివరించింది. ఈ విధానం వల్ల వాహనాలకు ఎటువంటి నష్టం వాటిల్లదని, పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్