ఈపీఎఫ్ ఖాతాదారులకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పీఎఫ్ వడ్డీ రేట్లను 10 శాతానికి పెంచేందుకు ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి శోభా కరంద్లేజ్ తెలిపారు. పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి వడ్డీ రేటు నిర్ణయిస్తారని, ఆదాయానికి మించి అధిక వడ్డీ అందించడం వల్ల మూలధనాన్ని కోల్పోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.