ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలివిడతగా ఈ మొత్తాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ విడుదల చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులతో రాష్ట్రానికి కొంత ఊరట లభించనుంది.