చమురు దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు, రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్ కలపడంపై దృష్టి సారించింది. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, డీజిల్‌తో ఇథనాల్‌ను నేరుగా కలపడం సాధ్యం కాదని, అందుకే ఇథనాల్ నుంచి ఐసోబ్యుటనాల్ తయారీకి కృషి చేస్తున్నామని, ఇది డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని తెలిపారు. ఇంధన స్వయం సమృద్ధికి ఇది కీలక అడుగు అని, పైలట్ ప్రాజెక్టు ప్రోత్సాహకర
ఫలితాలు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.