డీజిల్‌లో ఐసోబ్యుటనాల్‌ కలపడంపై కేంద్రం దృష్టి

11769చూసినవారు
డీజిల్‌లో ఐసోబ్యుటనాల్‌ కలపడంపై కేంద్రం దృష్టి
చమురు దిగుమతుల భారాన్ని తగ్గించి, పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పెట్రోల్‌లో 20% ఇథనాల్‌తో పాటు, ఇప్పుడు డీజిల్‌లో 15% ఐసోబ్యుటనాల్‌ కలపడంపై దృష్టి సారించారు. డీజిల్‌లో ఇథనాల్‌ నేరుగా కలపడం సాధ్యం కాదని, అందుకే ఇథనాల్‌ నుంచి ఐసోబ్యుటనాల్‌ తయారీకి కృషి చేస్తున్నామని, ఇది డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని, ఇంధన స్వయం సమృద్ధికి కీలక అడుగు అని మంత్రి పేర్కొన్నారు. ప్రయోగాత్మక ప్రాజెక్టు మంచి ఫలితాలు ఇచ్చిందని, భవిష్యత్తులో ఐసోబ్యుటనాల్‌ జీవ ఇంధనంగా మారుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్