కేంద్రం నోటీసులు.. ఎక్స్ వేదికగా స్పందించిన వాట్సాప్

2372చూసినవారు
కేంద్రం నోటీసులు.. ఎక్స్ వేదికగా స్పందించిన వాట్సాప్
యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలకు వాట్సాప్‌ స్పందించింది. ప్రస్తుతం యూజర్‌నేమ్‌లను రిజర్వ్‌ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని, మెసేజింగ్‌ సేవ ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టం చేసింది. ఈ ఫీచర్‌తో మొబైల్‌ నంబర్‌ను వెల్లడించకుండానే కనెక్ట్‌ అవ్వొచ్చని, అయితే ఇది తప్పనిసరి కాదని తెలిపింది. నకిలీ ఖాతాలు, మోసాలపై భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని, ప్రముఖులు, ప్రభుత్వ సంస్థల యూజర్‌నేమ్‌లను దుర్వినియోగం కాకుండా కాపాడుతామని వాట్సాప్‌ వివరణ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్