AP: కడప స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం స్పందించింది. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ హామీ ఏమైందని జనసేన ఎంపీ బాలశౌరి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి కుమార స్వామి స్పందిస్తూ.. ఈ అంశం తమ ముందు రాలేదని అన్నారు. ఒకవేళ ప్రతిపాదన వస్తే దీనిపై పరిశీలిస్తామని బదులిచ్చారు. కాగా, కేంద్ర మంత్రి సమాధానంతో కడప స్టీల్ ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు.