భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేవారికి అనుమతులు సులభతరం చేయడంతో పాటు, రోజువారీ సిలిండర్ డెలివరీలు 55 లక్షలు దాటాయి. బ్లాక్ మార్కెట్‌కు తరలింపును అరికట్టేందుకు కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.