న్యూ ఇయర్ సందర్భంగా ఏపీకి కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కనీస వసతులు లేని 935 ప్రభుత్వ పాఠశాలలను ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2020 జాతీయ విద్యా విధానం ద్వారా సకల సౌకర్యాలు కల్పించడంతో పాటుగా నాణ్యమైన విద్యను సైతం అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఏపీ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కి తెలియజేసింది.