అక్రమ చొరబాటుదారులపై కేంద్రం ఉక్కుపాదం.. అమిత్ షా కీలక సమావేశం

3956చూసినవారు
అక్రమ చొరబాటుదారులపై కేంద్రం ఉక్కుపాదం.. అమిత్ షా కీలక సమావేశం
దేశ భద్రతకు ముప్పుగా మారిన అక్రమ చొరబాటుదారులను ఏరిపారేయడానికి కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్త భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జూలై 9న దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఆపరేషన్ కోసం దేశంలోని అగ్రగామి నిఘా, దర్యాప్తు సంస్థలన్నీ ఒకే తాటిపైకి రానున్నాయి. అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని దేశం దాటించడం, నకిలీ పత్రాల నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడం, అక్రమార్కుల ఆస్తులను జప్తు చేయడం వంటి కీలక చర్యలు చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్