ఆన్‌లైన్ మూవీ పైరసీపై కేంద్రం కఠిన చర్యలు

7725చూసినవారు
ఆన్‌లైన్ మూవీ పైరసీపై కేంద్రం కఠిన చర్యలు
సినిమాల అక్రమ ప్రసారాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మొత్తం 7,393 లింకులు, ఛానళ్లను బ్లాక్ చేయాలని మధ్యవర్తులకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో 1,263 వెబ్‌సైట్లు, 4,996 టెలిగ్రామ్ ఛానళ్లు ఉన్నాయి. సినిమాల కాపీరైట్ ఉల్లంఘనలపై సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు కొనసాగించింది. లోక్‌సభలో సబంధిత శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్