బరువు తగ్గించే మందుల ప్రచారంపై కేంద్రం ఉక్కుపాదం!

9965చూసినవారు
బరువు తగ్గించే మందుల ప్రచారంపై కేంద్రం ఉక్కుపాదం!
స్థూలకాయం చికిత్సలో వాడే GLP-1 ఆధారిత మందుల (సెమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్)పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుదోవ పట్టించే ప్రచారాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ మందులను సాధారణ బరువు తగ్గించే టానిక్‌లా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని, కేవలం వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే వాడాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) హెచ్చరించింది. క్లినిక్‌లు, ఫార్మసీలలో తనిఖీలు నిర్వహించి, అనధికారిక విక్రయాలు జరిగితే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్