ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSME) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ECLGS) 5.0 ద్వారా భారీ ఊరట లభించనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 3,606 ఎంఎస్ఎంఈ సంస్థలకు మొత్తం రూ.1,280.43 కోట్ల రుణసాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో అదనపు హామీలు లేకుండానే బ్యాంకులు రుణాలు మంజూరు చేయనున్నాయి. 2027 జూన్ 30 నాటికి నిధుల పంపిణీ పూర్తికానుంది. దీంతో పరిశ్రమలకు వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కొనుగోలు, ఉత్పత్తి విస్తరణకు ఊతమివ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.