దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని విధించింది. లీటరు పెట్రోల్‌పై రూ. 4, డీజిల్‌పై ₹8.5, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై రూ.7.5 చొప్పున ఈ పన్నులు విధించారు. అయితే, మారిషస్, మాల్దీవ్స్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు చేసే ఎగుమతులపై ఈ పన్నుల నుండి మినహాయింపు ఇచ్చారు. దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై విధించిన ఎక్సైజ్ డ్యూటీలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.