AP: విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు హైదరాబాద్, చెన్నై వంటి నగరాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించి, విదేశీ విమానాలు, కార్గో సేవలు విస్తరించే అవకాశాలున్నాయి. ఇది వ్యాపారం, పరిశ్రమలు, పర్యాటక రంగానికి ఊపునివ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.