AP: ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ, పట్టణాభివృద్ధిశాఖల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు బిల్లు రానుంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. 2014లో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. 2019లో మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు జూన్ 2, 2024తో ముగియడంతో, ఆ రోజు నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏపీ రాజధాని వివాదానికి శాశ్వత పరిష్కారం లభించినట్లే.