రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లు ప్రకారం, తీవ్రమైన క్రిమినల్ లేదా అవినీతి కేసుల్లో 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రజాప్రతినిధులు తమ పదవిని కోల్పోతారు. రాజకీయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ప్రధాని, సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుంది. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరిగే ఈ సమావేశాల్లో, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) తన నివేదికను సమర్పించనుంది.