టెక్స్‌టైల్స్‌ రంగంలో కేంద్రం భారీ పథకం: గిరిరాజ్‌ సింగ్‌

5509చూసినవారు
టెక్స్‌టైల్స్‌ రంగంలో కేంద్రం భారీ పథకం: గిరిరాజ్‌ సింగ్‌
టెక్స్‌టైల్స్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ.10,683 కోట్లతో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్‌ఐ) పరిధిలోకి మ్యాన్‌ మేడ్‌ వ్రస్తాలు (ఎంఎంఎఫ్‌), ఫ్యాబ్రిక్స్, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌నూ చేర్చనున్నట్టు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందని, తాజా పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని, టెక్స్‌టైల్స్‌ రంగంలో వృద్ధి వేగం అందుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, అంతర్జాతీయ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్