AP: పాలనలో ఆధునిక సాంకేతికత, ఆర్టీజీఎస్ తో సమన్వయంపై అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డేటా ఆధారిత పాలన ఎంతో కీలకమని ఆయన తెలిపారు. తుఫాను సమయంలో టెక్నాలజీ సాయంతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించామన్నారు. ‘అందుబాటులో ఉన్న డేటాను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేస్తున్నాం. దీన్ని విస్తరించాలి. డిజిలాకర్‌లో విద్యార్థుల సర్టిఫికెట్లు, రోగుల హెల్త్ రికార్డులు అందుబాటులో ఉండాలి’ అని సూచించారు.