తిరుపతిలో గొలుసు దొంగలు హల్‌చల్

101చూసినవారు
తిరుపతిలో గొలుసు దొంగలు హల్‌చల్
AP: తిరుపతిలో గొలుసు దొంగలు హల్‌చల్ చేశారు. రెండు గంటల వ్యవధిలో సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారు. మ.3 గంటల సమయంలో ఇద్దరు యువకులు ముఖాలకు మాస్క్‌లు ధరించి పోస్టల్ కాలనీలో ఒంటరిగా నడిచి వెళ్తున్న జయశ్రీ (53)ని వెనుక నుంచి వెంబడించారు. ఆ తర్వాత గొల్లవానిగుంటలో ఇంటి అరుగుపై కూర్చున్న సరస్వతమ్మ (50), రాధా (45), నాగభూషణమ్మ (47) అనే మహిళల మెడలో గొలుసులు లాక్కొని పరారయ్యారు.

ట్యాగ్స్ :