ఓటీటీలోకి 'చాంపియన్' సినిమా.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

11630చూసినవారు
ఓటీటీలోకి 'చాంపియన్' సినిమా.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
యంగ్ హీరో రోషన్ మేకా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'చాంపియన్' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజాం పాలన కాలం నాటి రజాకార్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 2025 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు ₹17 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ట్యాగ్స్ :