డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లు అడ్డంగా దొరికారు : వైఎస్ జగన్

4716చూసినవారు
డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లు అడ్డంగా దొరికారు : వైఎస్ జగన్
AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. ర్యాలీని మళ్లించేందుకు చంద్రబాబు, లోకేష్‌లు గూండాలను దింపారని, యువగళం టీం కాదని, రౌడీ దళమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అవినీతి, స్కాంలను ప్రశ్నించే చోట ఈ దళాన్ని దించుతున్నారని, పోలీసులూ కొమ్ముకాస్తున్నారని, కుప్పంలోనే చంద్రబాబు కుట్ర పన్నారని, బహిరంగ సభలో బెదిరింపులే దీనికి సాక్ష్యమని జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి రౌడీ దళాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్