AP: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి వరుస జిల్లా పర్యటనలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక స్థాయిలో అమలును సమీక్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు చేపడుతున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జులై 1న చిల్లకూరులో పింఛన్ల పంపిణీ, శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. జులై 2న తిరుపతిలో, 3న జమ్మలమడుగులో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తారు. అనంతరం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని 5న అమరావతికి చేరుకుంటారు.