AP:
వైసీపీ గొడ్డలి పార్టీ కాదని, రైతుల ముసుగులో
టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నారా లోకేష్ ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని, చంద్రబాబు గొడ్డలిని లోకేష్ చేతిలో పెట్టారని విమర్శించారు. రైతుల విజ్ఞప్తి మేరకే
జగన్ పరిరక్షణ కమిటీ వేశారని, ఎంత అడ్డుకున్నా రైతుల పక్షాన పోరాడతామని తెలిపారు. రైతులు అడ్డుకోలేదని,
టీడీపీ గూండాలే అడ్డుకున్నారని, వారి దాడులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని అన్నారు.