బీసీ రిజర్వేషన్ల విషయంలో
వైసీపీ నేత, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ సీఎం చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. 34 శాతం బీసీ రిజర్వేషన్ చెల్లదని తెలిసి కూడా చంద్రబాబు డ్రామాలు చేశారని, బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్
జగన్ మాత్రమే బీసీలకు పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. కూటమి పాలనలో బీసీలపై దాడులు, అక్రమ కేసులు పెరుగుతున్నాయని, చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.